ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు' - rto

విశాఖలోని ప్రైవేట్ పాఠశాల బస్సులపై మూడో రోడు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్​నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేశారు. పిల్లలను బస్సులో పంపించే ముందు తల్లిందండ్రులు బస్సు ఫిట్​నెస్ పత్రాలను పరిశీలించాలని అధికారులు సూచించారు.

'ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు'

By

Published : Jun 17, 2019, 11:42 AM IST

'ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు'

విశాఖలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా ఆరు బృందాలుగా విడిపోయి ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండు వేల బస్సులు ఉన్నప్పటికీ... అందులో దాదాపు 1600ల బస్సులు మాత్రమే ఫిట్​నెస్ సర్టిఫికేట్​లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతి బస్సులో డ్రైవర్​కు సంబంధించిన పూర్తి సమాచారం..డ్రైవర్​ సీటు వెనుక భాగంలో పొందుపరచాలని సూచించారు. రవాణా శాఖ సూచించిన నిబంధనలను తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. మూడు రోజులుగా నిర్వహించిన డ్రైవ్​లో నిబంధనలు ఉల్లంఘించిన 20బస్సులపై కేసులు నమోదు చేసినట్లు.. మరో 18బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details