ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి భూమి స్వాధీనం

విశాఖపట్నంలో కొంత కాలంగా అధికారులు భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెందిన 8 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు.

mla velagapudi ramakrishna babu
mla velagapudi ramakrishna babu

By

Published : Dec 20, 2020, 5:01 PM IST

వెలగపూడి నుంచి స్వాధీనం చేసుకున్న భూమి

విశాఖ రుషికొండలోని సర్వే నెంబరు 21లో ఉన్న 8 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదైనప్పటికీ ఇంతకాలం విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధీనంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వైకాపా కక్షసాధింపు చర్యలో భాగంగానే తన భూమిని స్వాధీనం చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న అధికారులు

మరోవైపు జిల్లాలోని ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో సుమారు 30 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆర్డీవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 156లో సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం తహసీల్దార్ వేణుగోపాల్​తో కలిసి సంబంధిత స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆక్రమణల వెనుక ఉన్న వారిపై కూడా చర్యలు చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details