ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రింగు వలలతో సంప్రదాయ మత్స్యకారులకు తీవ్ర నష్టం' - vizag crime

విశాఖలో రింగువలల ద్వారా సంప్రదాయ మత్స్యకారులు నష్టపోతున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. వారికి రక్షణ కల్పించే చట్టాన్ని అమలులోకి తేవాలని సూచించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Retired IAS Officer EAS Sharma talks on ring net issue in vizag
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ

By

Published : Jan 11, 2021, 8:31 AM IST

రింగువలల ద్వారా కొంతమంది పెట్టుబడిదారులు సంప్రదాయ మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ ఆరోపించారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు లేఖ రాసిన ఆయన... సెక్షన్‌ 145 సీఆర్‌పీసీ అమల్లో ఉండగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఫలితంగా సంప్రదాయ మత్య్యకారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఈ క్రమంలో వారికి మరింత రక్షణగా నిలిచే ఏపీ మెరైన్‌ ఫిషింగ్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. వివాదాలతో చేపలవేట ఆగిపోయిన పరిస్థితులు విశాఖలో చాలాసార్లు జరిగాయని ఈఏఎస్ శర్మ గుర్తుచేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు విచారణ జరపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details