ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిపుత్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలు.. ఎందుకంటే..?

ఓ తండ్రి పేదల కష్టాలు చూశాడు. మారుమూల గిరిజన గ్రామాల్లో గిరిపుత్రులు పడుతున్న బాధలు యువకుడైన తన కుమారుడికి తెలియజేసి.. అతనిలో సేవా స్ఫూర్తిని నింపాలనుకున్నాడు. తదనుగుణంగా తన కుమారుడి 23వ పుట్టిన రోజును గిరిజనుల మధ్య జరిపించారు ఆ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. మరి విశాఖలో జరిగిన ఆ విశేషాలు మనమూ తెలుసుకుందామా..!

retaired army son birthday celebrations in  tribal people at visakhapatnam agency
గిరిజనులు మధ్య పుట్టిన రోడు వేడుకలు..

By

Published : Jan 4, 2020, 1:06 PM IST

గిరిజనులు మధ్య పుట్టిన రోజు వేడుకలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన తవిటయ్య ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. పాడేరు స్టేట్ బ్యాంకులో ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తవిటయ్య సిపాయిగా ఉన్నప్పుడు సరిహద్దుల్లో కష్టపడి విధులు నిర్వహించేవారు. పేదల కష్టాలు, గిరిజనులు పడే బాధలను అర్థం చేసుకున్న ఆయన.. తన పిల్లలకు వారిని చూపించి సేవాభావాన్ని పెంపొందించేలా చూడాలని తలచారు. అందుకు అనుగుణంగా బీటెక్​ చదివిన తన కుమారుడు ప్రశాంత్​ 23వ పుట్టిన రోజు వేడుకలను విశాఖ జిల్లా అనంతగిరి మండలం తోమ్కోటలో జరిపారు. గిరిజనుల దుర్భర జీవితం పిల్లలకు అర్థమయ్యేలా చేయడానికే తాను ఇలా చేసినట్లు తవిటయ్య తెలిపారు. దీని వల్ల వారిలో సేవ చేయాలనే స్ఫూర్తి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్కడి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్​ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్నాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details