విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాలు జల కళను సంతరించుకున్నాయి. మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొంతమేరకు వరద ఉద్ధృతి తగ్గింది. విశాఖ జిల్లా డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 6 వేల క్యూసెక్కులతోపాటు బాటు ఇతర వాగుల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతున్నందున వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ ఒక గేటు ఎత్తి 2 వేల క్యూసెక్కులు, డొంకరాయి ఏవీపీ డ్యాం ద్వారా 3 వేల క్యూసెక్కులు... మొత్తం 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పవర్ కెనాల్ ద్వారా 3,500 క్యూసెక్కుల నీటిని పొల్లూరు పవర్ హౌస్‌కు పంపుతున్నామన్నారు.