ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ సేవలు - apsrtc latest news

వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్టీసీ అద్దె బస్సులు సేవలందించనున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందను అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

rented rtc buses will completely  start from January
కొత్త ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ సేవలు

By

Published : Dec 29, 2020, 1:28 PM IST

కొత్త ఏడాది నుంచి ఆర్టీసీ సేవలు పూర్తి శాతం పని చేయనున్నాయి. ఆర్టీసీలోని అద్దె బస్సులూ జనవరి నుంచి రోడ్డు ఎక్కనున్నాయి. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరోనా ప్రభావంతో మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, అనకాపల్లి గ్రామీణ డిపోలకు సంబంధించి పరిమితంగా సర్వీసులను నడుపుతున్నారు. అద్దె బస్సులను కొంతకాలంగా నిలిపివేశారు.

కరోనా కేసులు క్రమేపీ తగ్గుమఖం పడుతున్నందున.. అద్దె బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అనకాపల్లి గ్రామీణ డిపో పరిధిలో ఈ ఏడాది మే 18 నుంచి 10 ప్రైవేటు బస్సులను మాత్రమే తిప్పారు. క్రమేపీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పెంచుకుంటూ వచ్చారు. పండగ సీజన్ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నుంచి మిగతా సర్వీసులను తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details