విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేశారు. రేషన్ డీలర్ల రాష్ట్ర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. మాడుగుల, చీడికాడ, కే. కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో సరకులు ఇవ్వకుండా నిలిపివేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో బీమా సౌకర్యం కల్పించాలని.. 6 విడతలుగా నిలిపేసిన కమిషన్ ఇవ్వాలని కోరారు.
మాడుగుల నియోజకవర్గంలో రేషన్ డీలర్ల నిరసన
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు.
రేషన్ డీలర్ల నిరసన