ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారులూ.. శ్మశానవాటిక స్థలాన్ని కాపాడండి' - విశాఖ జిల్లా తాజా వార్తలు

ఆక్రమణకు గురవుతున్న శ్మశానవాటికను కాపాడుకుందామని .. విశాఖ జిల్లా చీడికాడ మండలం వరహాపురం గ్రామస్థులు ర్యాలీ చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వీఆర్వో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.

శ్మశానవాటికను కాపాడుకుందామని వరహాపురంలో ర్యాలీ
శ్మశానవాటికను కాపాడుకుందామని వరహాపురంలో ర్యాలీ

By

Published : Mar 23, 2021, 9:33 PM IST

రోజురోజుకూ ఆక్రమణకు గురవుతున్న శ్మశానవాటికను కాపాడుకుందాం అంటూ.. విశాఖ జిల్లా చీడికాడ మండలం వరహాపురం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. స్థానిక చెరువు బాడుగు వద్ద 90 సెంట్లు స్థలంలో గ్రామానికి చెందిన పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులతో పాటు పలు కులస్థులకు చెందిన 70 కుటుంబాలు శ్మశానవాటికగా పూర్వీకుల నుంచి ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఆ స్థలం రోజురోజుకూ ఆక్రమణకు గురవుతోందని ఆరోపించారు.

గతంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ముత్యాలనాయుడు దృష్టికి సమస్య తీసుకెళ్లినా.. పరిష్కారం కాలేదన్నారు. ఈ విషయమై... ప్రధాన రోడ్డు నుంచి గ్రామంలోని సచివాలయం వరకు ర్యాలీ చేపట్టారు. శ్మశానవాటిక ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వీఆర్వో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. గ్రామ ఉప సర్పంచ్ రాజబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సత్యనారాయణ మద్దతుగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details