నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రైల్వే రాయితీలు ఇస్తోంది. ఈ రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా బిజినెస్ మోడల్ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం వ్యాపార వర్గాలు, వివిధ అసోసియేషన్ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. ఆపరేషన్స్ మేనేజర్ పేరిట డివిజన్ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేకంగా అధికార యంత్రాంగానికి బాధ్యత అప్పగించింది.
వాల్తేరు డివిజన్లో ఈ రకమైన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఏర్పాటు చేశారు. వివిధ వ్యాపార పరిశ్రమ వాణిజ్య వర్గాలు తమ అవసరాల కోసం నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేకంగా చర్చించేందుకు వీలు కల్పించారు.
భారతీయ రైల్వేలో సరుకు రవాణాలో రాయితీలు 2021 జూన్ ఆఖరి వరకు వర్తిస్తాయి. ఇంతవరకూ వంద కిలోమీటర్ల పైన రవాణా చేసే వారికి మాత్రమే రాయితీలు ఇచ్చేవారు. ఇప్పుడు 50 కిలోమీటర్ల లోపు రవాణాకి మొత్తం చార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తారు. 50 నుంచి 75 కిలోమీటర్ల పరిధిలో రవాణా చేయాలంటే 25 శాతం రవాణా చార్జీల రాయితీ లభిస్తుంది. 90 కిలోమీటర్ల లోపు అయితే 10% రాయితీ వర్తిస్తుంది. దీనివల్ల తక్కువ దూరం రవాణాకీ.. వ్యాపార వర్గాలు రైల్వే పై దృష్టి మళ్లించేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. ఈశాన్య రాష్ట్రాలు రవాణాకు మరో 6 శాతం అదనపు రాయితీని కల్పిస్తారు.
ఈ విధానం కింద 1400 కిలోమీటర్లు రవాణా చేసిన కోల్, కోక్లకు 20 శాతం రాయితీ ఇస్తారు. 1,600 కిలోమీటర్ల దూరం రవాణా చేసే ఇనుము ఉక్కుకు 20 శాతం రాయితీ లభిస్తుంది. 701 నుంచి 1500 కిలోమీటర్ల వరకు 15 శాతం రాయితీ వర్తింపజేస్తారు.
ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 26,506 కేసులు.. 475 మరణాలు