విశాఖ జిల్లా గొలుగొండ మండలం కంటపురం పంచాయతీ పెసర గ్రామంలో భారీగా సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఎస్సై ధనుంజయ నాయుడు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి .. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన ఎనిమిది వేల లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
సారా తయారీ కేంద్రాలపై దాడి.. ఇద్దరి అరెస్ట్ - golugonda latest news
విశాఖ జిల్లాలో సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కంటపురం పంచాయతీలోని పెసర అనే గ్రామంలో సారా బట్టీలను ధ్వంసం చేశారు.
కంటపురంలో సారా తయారీ కేంద్రాలపై దాడి