విశాఖ జిల్లా గొలుగొండ మండలం లింగంపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి అప్పారావు అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మూడు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పారావు ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు ఈదురు గాలులకు.. ఇంటిపై పడటంతో.. ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. సామాగ్రితోపాటుగా.. విలువైన పత్రాలు కాలి బూడిదయ్యాయని.. తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
లింగంపేటలో అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్ధం - today fire accident at visakha latest news
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. విశాఖ జిల్లా లింగంపేటలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రూ. మూడు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
లింగంపేటలో అగ్ని ప్రమాదం