కశింకోటలో పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులు - Puchalapalli Sundarayya Death anniversary news
విశాఖ జిల్లా కశింకోటలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని నాయకులు నిర్వహించారు. ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆయన పేరు, రూపం, జ్ఞాపకాలు నేటి తరానికి తీపి గుర్తులుగానే ఉంటాయని గుర్తు చేసుకున్నారు.
పుచ్చలపల్లి సుందరయ్య 35 వ వర్ధంతి..
కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని సీపీఎం నాయకులు విశాఖ జిల్లా కశింకోటలో నిర్వహించారు. సీపీఎం నాయకుల దాకారపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర అంతటా పర్యటించి కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయటానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. కేరళలో పర్యటించి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ వ్యాప్తికి దోహదపడ్డారని కొనియాడారు.