విశాఖపట్నం జిల్లా పాడేరులో స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. స్వల్పకాలంలో దిగుబడి వచ్చే పసుపు విత్తనాలను 90 శాతం రాయితీతో అందజేశారు. ఈ సహాయాన్ని వినియోగించుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆమె సూచించారు. పసుపు సాగుతో అవస్థలు పడుతున్న రైతులను ప్రభుత్వం గుర్తించి ఈ రాయితీ విత్తనాలను పంపిణీ చేస్తోందని పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ తెలిపారు.
మన్యం రైతులకు రాయితీ పసుపు విత్తనాలు అందజేత - పాడేరులో విత్తనాలు పంపిణీ
విశాఖపట్నం జిల్లా మన్యంలో పసుపు సాగును విస్తృతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 100 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయి. స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. స్థానిక రైతులకు స్వల్పకాలిక పసుపు దిగుబడి విత్తనాలు, పసుపు శుద్ధి పరికరాలను అందించారు.
మన్యం రైతులకు రాయితీ పసుపు విత్తనాలు అందజేత