Visakha Steel Plant in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహొదా కేటాయించాలని కోరుతూ నవంబర్ 11వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక నాయకులు విజయవాడలో తెలిపారు. గత 632 రోజులుగా స్టీల్ ప్లాంట్‌లోనూ, విశాఖ నగరంలోనూ వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీ నవంబర్ 12వ తేదీ విశాఖలో జరిగే బహిరంగ సభలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడాన్ని ఆపివేస్తామని ప్రకటించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కావాలని సష్టాల్లో నెట్టేందుకు ఉత్పత్తిని ఇటీవల కాలంలో 50% తగ్గించారన్నారు. సొంత గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం రూ.2 వేలకోట్లు విశాఖ స్టీల్ అదనంగా నష్టపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను, ప్రత్యేక హోదాను అమలు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు.
12న విశాఖకు ప్రధాని.. 11న నిరసనలకు ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపు - విశాఖలో మోదీ బహిరంగ సభ వివరాలు
Visakha Steel Plant: ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి మెదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో.. 11వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు.. విశాఖ ఉక్కు పరిరక్షణ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ అమ్మడాన్ని ఆపాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం గత 632 రోజుల నుంచి నిరసనలు చేస్తునట్లు తెలిపారు.
Visakha Steel Plant