ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి అవంతి కాన్వాయ్​ అడ్డగింత - vizag district latest news

పాడేరు పర్యటనలో ఉన్న పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్​ను కొవిడ్ వైద్య సిబ్బంది అడ్డుకున్నారు. కొవిడ్ కాలంలో సేవలందించిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

protest against minister avanthi srinivasarao kanvay in vizag district
మంత్రి అవంతి కాన్వాయ్​ అడ్డగింత

By

Published : Jan 6, 2021, 3:12 PM IST

Updated : Jan 6, 2021, 4:33 PM IST

విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఆడారిమెట్ట గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెళ్తుండగా... చింతలవీధి వద్ద కొవిడ్ వైద్య సిబ్బంది మంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్నారు. కరోనా బాధితులకు సేవలందించిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల కాలానికి జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్... వైద్య సిబ్బందిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన వీడకపోవడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.


ఇదీచదవండి.

బుల్లెట్​ నడుపుతూ..కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బాలయ్య

Last Updated : Jan 6, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details