విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం మినుములూరు ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం గర్భిణులు వచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంపులుగా గుమిగూడారు. ఈ ఘటనతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అధికారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వ్యాప్తి నివారణకు జాగ్రత్తలేవి?
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాప్తి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరం. అయితే.. విశాఖపట్నం జిల్లా మన్యంలోని మహిళలకు ఈ వైరస్ పై అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
చీరకొంగును మాస్కుగా పెట్టుకుంటున్న మహిళలు