విశాఖపట్నం నుండి పలు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాలపై పోలీసులు దాడులు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ జిల్లా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసుల తనీఖీల్లో...450కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మిగతా నిందితుల కోసం వెంబడించినా చిక్కలేదు. ఈ దాడుల్లో 10నెంబర్ ప్లేట్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
450 కిలోల గంజాయి స్వాధీనం - anakapalli
పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పలు రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు.
గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్న పోలీసులు
ఇది చూడండి: రిటైరైనా..సేవలు చేస్తాం