విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా చింతపల్లి మండలం అన్నవరానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న 400 యూరియా బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుంచి గబ్బాడా ఏటి గైరంపేట మీదుగా వెళుతున్న లారీని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. సరైన బిల్లులు లేకపోవడంతో... కేసు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల యూరియా స్వాధీనం - visakha district latest news
నర్సీపట్నం నుంచి చింతపల్లి మండలానికి సరైన పత్రాలు లేకుండా యూరియా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 400 బస్తాల యూరియాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు పట్టుకున్న లారీ
Last Updated : Aug 28, 2020, 6:41 PM IST