ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐటీడీఏ ఉద్యోగులకు సురక్షిత మంచి నీటి ప్లాంట్ ప్రారంభం - రక్షిత మంచినీటి సదుపాయం

పాడేరు ఐటీడీఏ లో సిబ్బంది వేసవి అవసరార్ధం మినరల్ వాటర్ ప్లాంట్​ను ఐటీడీఏ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు.

vishaka district
ఐటిడిఏ ఉద్యోగులకు మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన పీవో

By

Published : May 27, 2020, 11:38 AM IST

విశాఖ జిల్లా ఐటీడీఏ కార్యాలయ సిబ్బందికి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడానికి రూ 4.7 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్​ను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ సలిజామల ప్రారంభించారు. ప్రాజెక్ట్ అధికారి డీకే బాలాజీ ఐటీడీఏ ఉద్యోగులు తాగునీటి సదుపాయ లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఐటీడీఏ నిధులను రూ 4.7 లక్షలు నిధులు విడుదల చేశారు.

వెలుగు సిబ్బంది నారాయణ రావు ఆధ్వర్యంలో తాగునీటి పథకాన్ని నిర్మించారు. పీఓ వెంకటేశ్వర్ మినరల్ వాటర్ ప్లాంట్ నీటి నాణ్యత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి పథకం అందుబాటులోకి రావడంపై ఐటీడీఏ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐటీడీఏ ఏపీవోవీఎస్ ప్రభాకర్ రావు, పరిపాలనాధికారి కె. నాగేశ్వర రావు, వెలుగు ఏపీడీఎం నాగేశ్వరరావు, ఏ ఏవో సూర్యనారాయణ, డీపీఎం సత్యంనాయుడు, సీతారామయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కరోనా రికవరీలో తెలుగు రాష్ట్రాలు భేష్

ABOUT THE AUTHOR

...view details