'బాబు అసంతృప్త వాది'
విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రంపై తెదేపా కావాలనే ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తరువాత కూడా తెదేపా ఎందుకు నిరసన చేస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పడూ అసంతృప్తవాదే అని విమర్శించారు. జోన్ ఏర్పాటకు సంబంధించి ముఖ్యమంత్రి లేఖ రాసిన వెంటనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు.. చంద్రబాబు తన వైఖరేంటో తెలపాలని అన్నారు. జోన్ ఏర్పాటు పట్ల కేంద్రానికి దురుద్దేశ్యం ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత వారమే సీఎం చంద్రబాబు నుంచి విశాఖ రైల్వే జోన్ కోరుతూ రాసిన లేఖ అందుకున్నానని వెల్లడించారు.