విశాఖ గ్రామీణ జిల్లాలో గ్యాస్ సిలెండర్లను ముందుగానే బుక్ చేసుకుని ఇంట్లో నిల్వ చేసుకునే పనిలో చాలామంది నిమగ్నమయ్యారు. చోడవరంలో రోజు 500 సిలెండర్లు బుక్ అయ్యేవి. నేడు 650 నుంచి 700 కు పెరిగింది. ఇతర గ్రామాల నుంచి వినియోగదారులు గ్యాస్ గోదాంకు వచ్చి మరీ పట్టుకెళ్తున్నారు. డబుల్ సిలిండర్స్ ను ఇంట్లో భద్రపర్చుకునే పనిలో పడ్డారు. కొరత లేడకుండా అధికారులు, ఏజెన్సీల నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా భయం: గ్యాస్ సిలిండర్లను భద్రపరచుకుంటున్న జనం - covid 19
కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో నిత్యవసర వస్తువుల లభ్యత పై ప్రజల్లో అందోళన పెరుగుతోంది. ముందుగానే సరుకుల్ని కొనుగోలు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలెండర్లనూ ముందుగానే సమకూర్చుకుంటున్నారు.
గ్యాస్ సీలిండర్లును భద్ర పరచుకుంటున్న జనం