విశాఖలో కొవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద బాధితులు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ లైన్‌లలో నిలబడుతున్నారు. విశాఖలో మొత్తం 72 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మాక్ సెంటర్‌లలో కొవిడ్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఆరిలోవ లోని ఓ ప్రైవేటు ల్యాబ్ వద్ద జనాలు సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకు వరుసలో నిల్చున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా... ప్రజలు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో... రద్దీ ఎక్కువగా ఉంటోంది.
కొవిడ్ పరీక్షల కోసం జనం బారులు... ల్యాబ్‌ల వద్ద రద్దీ - covid test in vishakha news
కొవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద వైరస్ అనుమానితులు బారులు తీరుతున్నారు. ల్యాబ్‌ల వద్ద గంటల కొద్దీ లైన్‌లో నిల్చోని పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద రద్దీ అధికంగా ఉంటోంది.
కొవిడ్ పరీక్షల కోసం జనం బారులు