విశాఖ జిల్లా చోడవరం పట్టణవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీరు మురికిగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కోనాం అతిథి గృహం వెనుక, దుడ్డువీధిలో ఉన్న మంచినీటి పథకాల నుంచి నీరు నల్లగా, దుర్వాసన వస్తోందని ప్రజలు చెబుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. తాగేందుకు, ఇతర అవసరాల నిమిత్తం బోర్లు, ప్రైవేటు నీటి అమ్మకందారులను ఆశ్రయిస్తున్నారు. పంచాయతీ అధికారులు వీలైనంత త్వరగా తమ సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కుళాయిల నుంచి మురికి నీళ్లు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
విశాఖజిల్లా చోడవరం పట్టణవాసులు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. రోజూ వర్షాలు పడుతున్నా..మంచినీరు కోసం ఇబ్బంది పడటం ఆశ్చర్యం కలిగించే విషయం. నీటి కష్టాన్ని త్వరగా తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
నల్లాల నుంచి వస్తున్న మురికి నీళ్లు
Last Updated : Oct 20, 2020, 2:11 PM IST