విశాఖ జిల్లా చోడవరంలో రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు. గత ఐదు నెలలుగా బకాయిలు పడిన కమీషన్ చెల్లింపులు వెంటనే చేయాలంటూ స్థానిక మార్కెట్ యార్డులో నిరసన చేపట్టారు. చోడవరం, చీడికాడ మండలాలకు చెందిన సుమారు 80 మంది డీలర్లు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు బీమా పథకం వర్తింపజేయాలని... శానిటైజర్లు, మాస్క్, రోలింగ్ పేపర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
చోడవరంలో రేషన్ డీలర్ల ధర్నా - విశాఖ జిల్లా తాజా వార్తలు
గత ఐదు నెలలుగా ఉన్న బకాయిలను చెల్లించాలంటూ చోడవరంలో చౌక డిపో డీలర్లు ధర్నాకు దిగారు. తమకు బీమా పథకం వర్తింపజేసి... మాస్కులు, శానిటైజర్లు, రోలింగ్ పేపర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో పాల్గొన్న చౌక డిపో డీలర్లు