విశాఖ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ విశాఖ జైల్రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేతలు ఆంధ్రా వారిని తిడుతుంటేరాష్ట్ర ప్రజాప్రతినిధులుఎందుకు స్పందించలేదని నిలదీశారు. జగన్మోహన్రెడ్డి వరంగల్‌కు వస్తే రాళ్లతో కొట్టించిన కేసీఆర్....ఇప్పుడే అదే వ్యక్తికి మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కేసీఆర్కుఉంటే... ఆంధ్రాకి వచ్చి పోటీ చేయాలని సూచించారు. అంతేగానీ దొడ్డి దారిన జగన్‌కు మద్దతిస్తే మాత్రం సహించబోమనిస్పష్టం చేశారు.