ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇష్టారాజ్యంగా ప్రైవేట్​ ట్రావెల్స్​ తీరు..ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు - ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాకం

విశాఖ జాతీయరహదారి గురుద్వార్ కూడలిలో ప్రయాణికులకు ఓప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన బస్సు డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్లడం కోసం ప్రమాదానికి గురైన బస్సును ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు నిరసన తెలిపారు. బస్సును కదలనీయకుండా ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలిచి ట్రావెల్స్ యాజమాన్యం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

passengers-strikes-on-praivate-travels
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాకంతో ప్రయాణికులకు ఇబ్బందులు

By

Published : Jul 3, 2021, 8:24 AM IST

శ్రీకాకుళం, టెక్కలి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు ఓ ప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన బస్సు ఎక్కగా.. వీరిని దారి మధ్యలో రెండు బస్సులలోకి మార్చారు. బస్సు విశాఖకు చేరుకోగానే గురుద్వార కూడలిలో దించేశారు. దీనితో ఆగ్రహం చెందిన ప్రయాణికులు ట్రావెల్స్ యాజమాన్యాన్ని నిలదీయడంతో ప్రమాదానికి గురైన వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులంతా డ్రైవర్​తో వాగ్వాదానికి దిగారు.

తాము హైదరాబాద్​కు వెళ్లేందుకు ఒక్కొక్కరు రూ. 2వేలు పెట్టి టిక్కెట్లు కొన్నామని..బస్సు డైరెక్ట్​గా హైదరాబాద్​కు వెళ్తుందని చెప్పి ఇప్పటికే రెండు బస్సులు మార్చారని, తీరా విశాఖకు చేరుకోగానే రోడ్డుపై దించేసి చాలా సేపటి తరువాత ప్రమాదానికి గురైన బస్సులో వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిక్కెట్ల కోసం వేలకు వేలు తీసుకుని ఇలా రోడ్డుపై వదిలేయడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు కదలకుండా రోడ్డుపై అడ్డంగా నిలిచి.. యాజమాన్యం స్పందించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details