నిన్న సాయంత్రం నర్సీపట్నం పెద్దచెరువులో కిశోర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 4 నుంచి కనిపించట్లేదని 7న పోలీసులకు కిశోర్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని.. స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న యువతితో ప్రేమించి.. తమ వాడు బలయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని.. పోలీస్ట్ స్టేషన్ ఎదుట కిశోర్ మృతదేహంతో బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు.
యువకుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన - విశాఖ క్రైమ్ న్యూస్
విశాఖ జిల్లా నర్సీపట్నం పీఎస్ ఎదుట ఎస్సీ యువకుడు గార కిశోర్ తల్లిదండ్రుల నిరసన తెలిపారు. కిశోర్ మృతికి కారకులను అరెస్టు చేయాలంటూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
parents agitaion with dead body infront of narsipatanam police station