ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 4, 2021, 9:05 PM IST

ETV Bharat / state

ఈ కేవైసీ కష్టాలు.. మీ సేవ కేంద్రం వద్ద పడిగాపులు

రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి తదితర పథకాలకు ఆధార్, ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. విద్యాసంస్థలు తెరుచుకోవడంతో విశాఖ మన్యంలోని ముంచంగిపుట్టు మండలం పరిధిలోని మూరుమూల గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ పిల్లలకు ఈ -కేవైసీ నమోదు చేయించేందుకు మీ సేవ కేంద్రం వద్ద రాత్రి 10 గంటలైనా పడిగాపులు కాస్తున్నారు.

మీ సేవ కేంద్రం వద్ద తల్లిందండ్రుల పడిగాపులు
మీ సేవ కేంద్రం వద్ద తల్లిందండ్రుల పడిగాపులు

మీ సేవ కేంద్రం వద్ద తల్లిందండ్రుల పడిగాపులు

కొవిడ్ కారణంగా దాదాపు ఏడాదిన్నర తరువాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులకు ఆధార్ నమోదు, ఈ కేవైసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో మన్యంలో అత్యంత మారుమూల మండలం ముంచంగిపుట్టులో మీ సేవ కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటర్​నెట్ సమస్యలతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా.. పనిపూర్తి కాకపోవడంతో రాత్రి 10 గంటలు అయినా.. అక్కడే ఉండిపోయారు. తినడానికి తిండి లేక మంచినీటితో ఆకలి తీర్చుకున్నారు. చిన్నారులు కునికాపాట్లు పడుతున్న తీరు ఆ తల్లిందండ్రుల అవస్థలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులను అడగ్గా.. పంచాయతీల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా ప్రజలు మారుమూల గ్రామాల నుంచి వస్తున్నారని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details