విశాఖ జిల్లా పాడేరులో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు విశాఖ జిల్లా చింతపల్లి మండలం పెదగొంది వాసులుగా పోలీసులు గుర్తించారు.
ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్ - పాడేరులో బైక్ దొంగతనాలు
విశాఖ జిల్లా పాడేరులో ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
గత ఏడాదిగా ఇద్దరూ ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ తెలిపారు. విశాఖ జిల్లాతోపాటు.. తూర్పుగోదావరి జిల్లాలోనూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులు ఒడిశాలో ద్విచక్రవాహనాలు అమ్మడానికి సిద్ధం చేసుకున్నారని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 6,096 కేసులు, 20 మరణాలు