జలాశయాలు, కాలువలు ఎండిపోయాయి.. వేసిన పైరు ఎర్రబడుతుంది... మోటర్లు పెట్టి, రోజుకు 200 రూపాయలు ఇచ్చి తడుపుతున్న లాభం లేదు... నీరు లేకపోతే 56 వేల ఎకరాల సాగు నిలిచిపోతుంది. విశాఖ జిల్లా చోడవరంలోని రైవాడ జలాశయంలోని నీరు లేదు... దానిపై ఆధారపడి బతుకుతున్న రైతులకు పంటా లేదూ... అందుకే ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు అక్కడ రైతులు.
పంటెండుతుంది.. ఆదుకోండి సీఎం సారూ....
వర్షాకాలం .... రైతన్నలకు పంటనే కాదు.... బతుకును పండించే కాలం.. మరీ ఇది ఇప్పుడున్న కాలంలో జరుగుతుందా.. వరుణుడు మోఖం చాటేస్తున్నాడు.... ప్రభుత్వం చొరవచూపి... సబ్సీడీ ద్వారా బోర్లు వేయిస్తే.. కొంచెం ఆసరాగా ఉంటుందంటున్నారు విశాఖ జిల్లా చోడవరం రైతులు. సీఎం సారూ.... ఆదుకోండి మమ్మల్ని అంటూ మొరపెట్టుకుంటున్నారు.
రైతు కష్టాలను ఆదుకునేదెవరూ..