సంక్రాంతిని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్లో పతంగులు ఎగురవేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి కనబరిచారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేశారు. అత్యంత ఎత్తులో ఎగురవేసేందుకు పోటీలు పడ్డారు. సాగర తీరం అంతా సందర్శకులతో నిండిపోయింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం పతంగి ఎగురవేసి సందడి చేశారు.
సాగర తీరంలో సంక్రాంతి సంబరం.. గాలిపటాల విహంగం - విశాఖ బీచ్ తాజా వార్తలు
విశాఖ సాగరతీరంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా గాలి పటాలు ఎగురవేసేందుకు వచ్చినవారితో ఆర్కే బీచ్ నిండిపోయింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం.. సరదాగా గాలిపటం ఎగురవేశారు.
kite