ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 4:44 PM IST

ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​కి పూర్వవిద్యార్థుల వితరణ

కొవిడ్ రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నివారణ చర్యలకు విశాఖ జిల్లా మాడుగుల ప్రభుత్వం జూనియర్ కళాశాలకు చెందిన పూర్వవిద్యార్థులు ముందుకొచ్చారు. 1986-88 బ్యాచ్ విద్యార్థులంతా కలిసి సొంతంగా డబ్బులు సమకూర్చి కొవిడ్ కేర్ సెంటర్​కి దుప్పట్లు, మాస్కులు అందజేశారు.

Donate blankets and masks to Covid Care Center
కొవిడ్ కేర్ సెంటర్​కి దుప్పట్లు, మాస్కులు విరాళం

విశాఖ జిల్లా మాడుగులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​కు 1986 - 88 బ్యాచ్ విద్యార్ధులు దుప్పట్లు, మాస్కులు అందజేశారు. ఈ కేంద్రానికి సహకారం అందించాలని నిర్ణయించుకున్న పూర్వవిద్యార్థులు.. సొంతంగా సమకూర్చిన డబ్బులతో 100 దుప్పట్లు, 500 మాస్కులను కొనుగోలు చేశారు. కొవిడ్ కేర్ సెంటర్ అధికారి తహసీల్దార్ సత్యనారాయణకు.. పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు పుట్టా శ్రీనివాసరావు, జాగాని అచ్యుతరావులు అందజేశారు. పూర్వవిద్యార్థులు సేవలను అధికారులు కొనియాడారు. గతేడాది మొదటి విడత కొవిడ్ సమయంలో రూ.50 వేలు విలువైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు పూర్వవిద్యార్థులు సంఘం ప్రతినిధులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details