ట్రైసైకిల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తున్న వలసకార్మికుడు లాక్ డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్తరులు అమ్ముకోడానికి ఉత్తరప్రదేశ్ నుంచి రాజమండ్రికి వచ్చిన రాంసింగ్ అనే దివ్యాంగ వృద్దుడు... తన స్వగ్రామానికి ట్రై సైకిల్ పై బయలుదేరాడు. రాజమండ్రి నుంచి విశాఖ వరకు వచ్చిన ఆయనను... విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్ద కాస్త విశ్రాంతి తీసుకుంటుండగా... ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ శశిధర్ పలకరించి వివరాలు తెలుసుకున్నారు. దారి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు.
"ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ వద్ద ఒక పల్లెలో ఉంటాము. నేను మూడు రోజుల క్రితం రాజమండ్రి నుంచి బయలుదేరాను. కరోనా కారణంగా అత్తరు అమ్మకాలు లేక స్వగ్రామానికి వెళ్తున్నాను.
నేను 40 నుంచి 50 కిలో మీటర్లు ప్రయాణం చేసి సేద తీరి...మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. తినడానికి తిండిలేదు... రోడ్డుపై వెళ్లేవారిని అడిగితే రూ.10 లేదా 15 ఇస్తున్నారు... వాటితో ఏదైనా తింటున్నాను. లాక్డౌన్ కారణంగా మా వ్యాపారం పడిపోయింది... పోలీసులు మా స్వస్థలాలకు పంపించటం లేదు. మాకు రోజు గడవటం చాలా కష్టంగా ఉంది. నాతో పాటు ఇక్కడకు వచ్చిన నలుగురు కాలినడకన స్వగ్రామానికి వెళ్లారు. నేను ఇలా ప్రయాణిస్తున్నాను. ఊరిలో కాస్తంత పొలం ఉంది... ఆ పొలం పనులు చేసుకుని బ్రతుకుతాము. లారీ ప్రమాదంలో నా కాళ్లు ఇలా చచ్చుబడిపోయాయి. అయినా సరే నేను మా ఊరు వెళ్లగలను" -రాంసింగ్
ఇదీ చదవండి:
వలస కూలీలకు తెదేపా ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ