విశాఖ నగర శివారు ప్రాంతం అమనాంలో పులి సంచరిస్తుందన్న అనుమానంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. అమనాం ప్రాంతం కొండవాలు ప్రాంతంలో గత రాత్రి వేమల అన్నపూర్ణకు చెందిన రెండు ఆవులను కొబ్బరిచెట్లకు కట్టేశారు. తెల్లవారుజాము చూసేసరికి ఒక ఆవు రక్తపు మడుగులో పడి ఉంది. కచ్చితంగా పులే ఆవును గాయపరిచి ఉంటుందిని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆవు వీపు, కాలుపై తీవ్రగాయాలయ్యాయి. అధికారులు స్పందించి పులిని పట్టుకుని.. పశువులు, తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు - Oh tiger! Save
విశాఖ నగరంలోని అమనాంలో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పులి సంచరిస్తుందనే అనుమానంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.
అమ్మో పులి! కాపాడండి