గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో అధికారుల ఆకస్మిక తనిఖీ - schools
గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలపై ఆరా తీశారు. సౌకర్యాలు పరిశీలించిన ఐటీడీఏ అధికారి మరమత్తులు చేయించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
officers-visit-girijan-schools
విశాఖ జిల్లాలోని పాడేరు మలక పొలం గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాలలో ఐటీడీఏ అధికారి బాలాజీ, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు పరిశీలించి..మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలపై ఆరా తీశారు. గ్రహణం మొర్రితో బాధపడుతున్న ఓ విద్యార్థికి చికిత్స చేయించాలంటూ అధికారుల్ని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాలు చేసి అక్కడే బస చేశారు.