ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NO PENSION: అయ్యా మమ్మల్ని పట్టించుకోండి.. - విశాఖపట్నం తాజా వార్తలు

విశాఖలో వృద్ధురాలైన తల్లీకూతుళ్లకు పింఛన్ కష్టం వచ్చి పడింది. ఒకే రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉన్నాయనే కారణంతో పెన్షన్​ నిలిపివేశారు.

విశాఖలో ముసలి తల్లీ కూతుళ్ల పింఛన్ నిలిపివేసిన అధికారులు
విశాఖలో ముసలి తల్లీ కూతుళ్ల పింఛన్ నిలిపివేసిన అధికారులు

By

Published : Sep 6, 2021, 2:51 PM IST

Updated : Sep 6, 2021, 3:11 PM IST

విశాఖలో పండు ముదుసలి తల్లీ కుమార్తెలకు పింఛన్ కష్టం వచ్చింది. ఒకే రేషన్‌కార్డులో పేర్లు ఉన్నాయనే కారణంతో పింఛన్‌ నిలిపివేశారు. సింహాద్రిపురం కాలనీకి చెందిన కంటిబుక్త అప్పల నరసమ్మకు 110 ఏళ్ల వయసు. ఆమె కుమార్తె లక్ష్మికి 80 ఏళ్లు. ఇరువురూ ఓ పూరిగుడిసెలో నివసిస్తున్నారు. గతంలో ఇద్దరికీ పింఛన్‌ వచ్చినా..వేలిముద్రలు పడటం లేదంటూ అప్పల నరసమ్మకు కొన్నేళ్ల క్రితమే పింఛన్‌ నిలిపివేయగా.. ఈనెల నుంచి ఆమె కుమార్తెకూ పింఛన్‌ ఇవ్వలేదు.

Last Updated : Sep 6, 2021, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details