విశాఖ జిల్లా చీడికాడ మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో వెలుగు, ఉపాధి హామీ పథకం మండల కార్యాలయాన్ని నిర్మించారు. 32 లక్షల రూపాయల వ్యయంతో ఆరేళ్ల క్రితమే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. లక్షల రూపాయలు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనం పూర్తై.. ఏళ్లు గడుస్తున్నప్పటికీ వినియోగంలోకి రాకపోవటం విమర్శలకు తావిస్తోంది. నాలుగేళ్ల క్రితం తుపాను ప్రభావంతో పాడైన ఈ భవనాన్ని.. మరో రూ. 5 లక్షలు కేటాయించి మరమ్మతులు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించి.. ప్రతి నెలా బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. అయినప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు.
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజా ధనం వృథా - విశాఖలో వెలుగు ఉపాధి హామీ పథకం కార్యాలయాలు తాజా వార్తలు
లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. ఆరేళ్ల క్రితమే నిర్మించిన ఉపాధి కార్యాలయం వైపు.. చూసిన అధికారులే లేరు. ఈ కారణంగా.. లక్షలు పోసి నిర్మించిన భవనం.. అసాంఘిక కార్యకలపాలకు నిలయంగా మారింది.
నిర్లక్ష్యంగా వదిలేసిన వెలుగు, ఉపాధి హామీ పథకం మండల కార్యాలయం
లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం.. అధికారులు పట్టించుకోకపోవటంతో వృథాగా పడి ఉంది. తలుపులు, కిటికీలకు చెదలుపట్టి పాడైపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక మండల అభివృద్ధి అధికారి జయప్రకాశరావు వద్ద ప్రస్తావించగా.. వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: