విశాఖ జిల్లా పాయకరావుపేట చెందిన ఉపాధ్యాయునికి.. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో ఉండగా కరోనా సోకింది. ఈ ఘటనపై వైద్యాధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆయన నివాస ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కాలనీవాసులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బాధితుడు తిరిగిన ప్రదేశాన్ని, అతను పనిచేసిన పాఠశాల విద్యార్థులకు పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. అనుమానితులను గుర్తించే కార్యక్రమం వేగవంతం చేశామని కరోనా నివారణ ప్రత్యేక అధికారి మురళీమోహన్ అన్నారు.
రెడ్‌జోన్‌లో అధికారులు అప్రమత్తం - పాయకరావుపేటలో కరోనా వార్తలు
ఒక జిల్లా వ్యక్తికి మరో జిల్లాలో కరోనా సోకిన ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. అతను తిరిగిన ప్రతీ చోటుని జల్లెడ పడుతున్నారు. ఎవరిని కలిశాడు... ఇంకెవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా అనే కోణంలో అనుమానితులను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు.
Officers alerted at Payakaraopet Red Zone in visakha