నూక తాత...సంబరం - vishaka patnam
నూక తాత పాదం తాకితే శుభం కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయని గంగపుత్రుల నమ్మకం. దీనికోసం సముద్ర తీరంలో స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి నేలపై పడుకుంటారు. పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు, నూతన వధూవరులు, పిల్లలు కావల్సిన వారు సైతం క్యూలైన్లలో పడుకొని ఆయన పాదం తాకేలా ప్రార్ధనలు చేస్తారు
ఆయన పాదం తాకితే శుభం కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయని గంగపుత్రుల నమ్మకం. దీనికోసం సముద్ర తీరంలో స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి నేలపై పడుకుంటారు. పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు, నూతన వధూవరులు, పిల్లలు కావల్సిన వారు సైతం క్యూలైన్లలో పడుకొని ఆయన పాదం తాకేలా ప్రార్ధనలు చేస్తారు.
ఆయన ఎవరు... ఎక్కడ జరుగుతోంది.
పూర్వ కాలంలో నూక తాత అనే వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తమ గ్రామాన్ని కాపాడారని గంగపుత్రులు చెబుతారు. స్వయంగా ఆ దేవుడే తమను రక్షించటం కోసం తాత రూపంలో మరణించారనేది వారి నమ్మకం.
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయపేట గ్రామంలో ఏటా నిర్వహించే మత్స్యకారుల ఉత్సవం పేరే 'నూకతాత సంబరం'. ఏటా శివరాత్రి ముగిసిన రెండు రోజుల తర్వాత ఘనంగా 'నూకతాత సంబరం' మొదలవుతుంది. ఈ ఉత్సవాలలో నూకతాత పూనకం రూపంలో వచ్చి తమను రక్షిస్తారని గంగపుత్రుల నమ్మకం. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు మన రాష్ట్రం వారితో పాటు కేరళ, తమిళానాడు, ఒడిశా, దేశ, విదేశాలలో స్థిరపడిన మత్స్యకారులు సైతం హాజరవుతారు.