విశాఖ పాడేరు ఏజెన్సీలో చాలా గ్రామాల్లో సిగ్నల్స్ సేవలు అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంలో తడుస్తూ గొడుగుల చేతపట్టుకొని ప్రభుత్వ పథకాల ఆన్లైన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి, డుంబ్రిగుడ మండలం సొవ్వా, జి.మాడుగుల మండలం పులుసుమామిడి కొండలలో ఎక్కడ చూసినా గొడుగులు వేసుకుని వర్షంలో ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా ఆన్లైన్ కోసం కొండల్లో గిరిజనులు వర్ష పోతున్నారు. సచివాలయ పరిధిలో సెల్ టవర్లు నిర్మించి అక్కడే ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ప్రభుత్వ పథకాల ఆన్లైన్ కోసం తంటాలు.. సిగ్నల్స్ కోసం పడిగాపులు - vishakha latest news
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆన్ లైన్ చేసుకోవాల్సిందే. లేదంటే వాటిపై ఆశలొదులుకోవాల్సిందే. సాధారణంగా అయితే ఇది చాల తేలికైన పని. కానీ విశాఖ ఏజెన్సీలో ప్రజలకు ఇది పెను సవాలుగా మారుతోంది. సిగ్నల్స్ సమస్య వేధిస్తుండడంతో వారు ఆన్లైన్ చేసుకోవడానికి కొండలపై నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
no cell signals in vishakha agency