ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 9వ తేదీన దేశవ్యాప్త నిరసన

రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన దేశవ్యాప్త నిరసన నిర్వహించనున్నట్లు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని గాంధీ ప్రకటించారు.

vishaka district
రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 9వ తేదీన దేశవ్యాప్త నిరసన

By

Published : Aug 6, 2020, 4:38 PM IST

కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో రైల్యే ప్రైవేటీకరించటం పట్ల రైల్ మజ్దూర్ యూనియన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన దేశవ్యాప్త నిరసన నిర్వహించనున్నట్లు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని గాంధీ ప్రకటించారు. రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తే పేద మధ్యతరగతి వర్గాలకు రైల్వే సేవలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైల్ మజ్దూర్ యూనియన్ విశాఖ ప్రధాన కార్యాలయం వద్ద 9వ తేదీ నిరసన గోడ పత్రికను యూనియన్ డివిజనల్ నాయకులతో కలిసి గాంధీ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజనల్ కార్యదర్శి పి.ఎం. ఆర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి రైల్వే సిబ్బంది, అధికారులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details