ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ లాంటిది: నారా రోహిత్ - హీరో నారా రోహిత్ వార్తలు

విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ లాంటిదని.. సినీ హీరో నారా రోహిత్ అన్నారు. త్వరలో విశాఖకు వెళ్లి ఉక్కు ఉద్యమంలో పాల్గొననున్నట్లు.. ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

NARA ROHITH TWEETS ON VISHAKA STEEL PLANT PRIVATISATION
విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ లాంటిది: నారా రోహిత్

By

Published : Mar 13, 2021, 6:07 PM IST

విశాఖ ఉక్కు ఉద్యమానికి సినీ హీరో నారా రోహిత్ మద్దతు ప్రకటించారు. త్వరలోనే విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొననున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు. నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలన్నారు. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ లాంటిదన్నారు. ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి అని వెల్లడించారు.

'ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనాలు' అని నారా రోహిత్ అన్నారు. తెలుగువాడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details