విద్యార్థులకు అధ్యాపకులు విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువలు నేర్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇటీవల విశాఖలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన వైద్య విద్యార్థులు సాయిదుర్గ, సుభాషిణి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారు చికిత్స పొందిన కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి మరణంలో ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలకు న్యాయం చేసేందుకు మహిళా కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
వైద్య విద్యార్థుల మృతి బాధాకరం: నన్నపనేని - demise
విశాఖలో వైద్య విద్యార్థుల మృతి బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణంలో ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వైద్య విద్యార్థుల మృతి బాధాకరం: నన్నపనేని