ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా నల్ల మారమ్మ తల్లి జాతర - షేకిల్ల పాలెం గ్రామంలో నల్ల మారమ్మ తల్లి అమ్మవారి జాతర

విశాఖ జిల్లా షేకిల్ల పాలెం గ్రామంలో నల్ల మారమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి వేల సంఖ్యలో అక్కడికి హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.

nalla maramma jatara
వైభవంగా నల్ల మారమ్మ తల్లి అమ్మవారి జాతర

By

Published : Jan 23, 2021, 5:12 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం షేకిల్ల పాలెం గ్రామంలో నల్ల మారమ్మ తల్లి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం వద్ద ప్రతియేటా వీటిని నిర్వహిస్తారు. అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

దేవాదాయ శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక్కడ చిలకల తీర్థం ప్రత్యేకతను సంతరించుకుంది. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details