Musings of Mahatma Gandhi book: సాహిత్య కవిత్వం సమాజంలోని సామాజిక సాంస్కృతిక జీవనంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందని ప్రముఖ నేపథ్య గాయకుడు, పాడుతూ తీయగా యాంకర్ ఎస్పీ చరణ్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన “మ్యూజింగ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ” కవితా సంకలన పుస్తకాన్ని చరణ్ శనివారం విశాఖ సీతమ్మధారలో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీపై సాహిత్యం అందించినందుకు డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్‌ను చరణ్ అభినందించారు. మహాత్మా గాంధీ తన ప్రత్యేకమైన కమ్యూనికేషన్ ద్వారా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేశారని ఆయన అన్నారు. అంతరించిపోతున్న గిరిజన భాషలపై తన అకడమిక్ పరిశోధనల గురించి డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ చరణ్‌కు వివరించారు.
మ్యూజింగ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ” కవితా సంకలనాన్ని విడుదల చేసిన ఎస్పీ చరణ్
S.P Charan: ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ “మ్యూజింగ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ” కవితా సంకలన పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ చరణ్ ఈరోజు విశాఖలోని సీతమ్మధారలో ఆవిష్కరించారు.
S.P Charan