ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పింఛనర్ల జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి'

పింఛనుదారుల సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత ఈపీఎస్ పెన్షనర్ల సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఈఈఎల్.మురళీకృష్ణ గుంటూరు నుంచి వారణాసి వరకు ద్విచక్ర వాహన యాత్రను చేపట్టారు. యాత్రలో భాగంగా విశాఖ చేరుకున్న ఆయన ... పింఛనర్ల జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

bike trip
ద్విచక్ర వాహన యాత్ర

By

Published : Dec 22, 2020, 10:29 PM IST

పింఛనుదారులు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలనే ఉద్దేశంతో అఖిలభారత ఈపీఎస్ పెన్షనర్ల సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఈఈఎల్.మురళీకృష్ణ ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వారణాసి యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా విశాఖ చేరుకుని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ల్​లో మాట్లాడారు.

కనీస పింఛను 7,500 రూపాయలు కరవు భత్యం తో పాటు ఇవ్వాలని.. ఉన్నత స్థాయి పింఛను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పింఛనర్ల జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ, ఎంపీ హేమమాలినిని పెన్షనర్ల సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు అశోక్ రావు రౌతు, కార్యదర్శి వీరేంద్ర సింగ్ కలిసి విజ్ఞప్తి చేశారని మురళీకృష్ణ తెలిపారు.

మురళీ కృష్ణ ప్రయాణం :

మురళీ కృష్ణ గుంటూరు లో బయలుదేరి ఆర్టీసీ పింఛను దారులను ఇతర పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కలుసుకుంటూ విజయవాడ, ఏలూరు, తుని మీదుగా విశాఖ చేరుకున్నారు. అనంతరం విశాఖ నుంచి ఒడిశా మీదుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తూ వారణాసి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి :

'ఆస్తి విలువ పై ఇంటి పన్ను.. రద్దు చేయండి'

ABOUT THE AUTHOR

...view details