రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడరని స్పష్టం చేశారు. విశాఖ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఓటమిపై తెదేపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయంటూ... ప్రజాభిప్రాయాన్ని అగౌరవపరచడం సరికాదన్నారు. వైద్య, విద్య రంగాలను పటిష్టం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు అండగా నిలుస్తామని వెల్లడించారు.
తెదేపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి: అవంతి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు జగన్ కట్టుబడి ఉన్నారని వైకాపా నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో మీట్ ది ప్రెస్లో ఆయన పాల్గొన్నారు.
భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు