విశాఖ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలతో విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు దీనికి హాజరయ్యారు. డీడీఆర్‌సీ సమావేశం తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని...కొంత మంది కావాలనే దీనిపై రచ్చ చేస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మండిపడ్డారు. ప్రజల సమస్యల్ని ఎమ్మెల్యేలు చెబుతారని.. వాటినే డీఆర్సీ సమావేశంలో చర్చించామని చెప్పుకొచ్చారు. సమావేశంలో కేవలం సంక్షేమ పథకాలపై చర్చించామన్న ఎమ్మెల్యే...అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తామన్నారు.
విశాఖ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు : ఎమ్మెల్యే గణేష్ కుమార్ - MP Vijayasaireddy meeting with Visakhapatnam MLAs
విశాఖ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి..చర్చించారు. డీడీఆర్‌సీ సమావేశం తర్వాత జరిగిన పరిణామాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.
ఎమ్మెల్యే గణేష్ కుమార్