ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారుల నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ - araku mp madhavi news today

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు.

రహదారి నిర్మాణ పనులకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ భూమి పూజ
రహదారి నిర్మాణ పనులకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ భూమి పూజ

By

Published : Oct 7, 2020, 10:56 PM IST

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో కోట్లాది రూపాయలు విలువ చేసే రహదారుల నిర్మాణ పనులకు అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ శంకుస్థాపన చేశారు. పెదబయలు మండలం రూడకోట గ్రామంలో పీడీ రోడ్డు నుంచి ఒడిశా సరిహద్దులో రూడకోట, కుమడ మీదుగా రూ. 13. 21 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులు ప్రారంభించారు.

రహదారి నిర్మాణానికి..

ఒడిశా సరిహద్దు రోడ్డు నుంచి కెందుగూడ వరకు రూ. 385.00 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న రహదారి పనులను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి జగన్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. గిరిజనులు రహదారులను సక్రమంగా వినియోగించుకోవాలని ఎంపీ మాధవి సూచించారు.

ఇవీ చూడండి:

వైఎస్​ఆర్ చేయూత, ఆసరాలో ఎక్కడా లోపం రావొద్దు: సీఎం

ABOUT THE AUTHOR

...view details