ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించి.. ప్రకృతిని రక్షించుకోవాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పిలుపునిచ్చారు. ఎంపీ స్వగ్రామమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడి వలన ప్రకృతికి ఎంతో నష్టం చేకూరుతుందనీ.. అందరూ మట్టి ప్రతిమలకే పూజలు చేయాలన్నారు.
మట్టి వినాయక ప్రతిమల తయారీలో యువత
మట్టి వినాయక ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతూ కరోనా పుణ్యమా అని ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలకు బదులు.. యువత మట్టి వినాయక ప్రతిమలను తయారీలో నిమగ్నమయ్యారు.
చింతపత్లి మండలం గొందిపాకలు,చిక్కుడుబట్టి, దిగువపాకలు, ఎర్రవరం, బద్దిమెట్ట, చినబరడ గ్రామాల్లో గిరిజన యువకులు మట్టి విగ్రహాలు తయారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అత్యంత నిరాడంబరంగా జరగనున్నాయి.
మట్టి వినాయకుడిని తయారీ చేస్తున్న యువకుడు ఇదీ చదవండి:వాగులో చిక్కుకున్న డ్వాక్రా మహిళ